పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

19


తన బలిపీఠ మార్ద్రదుకూలపతితాంధ
                 బధిరవంధ్యాపంగుపరివృతంబు
తన మహానసము నూతనఘృతాత్తాలంబ
                 సౌరభ్యవాసితాశావలయము
తన గర్భగృహము చందనచంద్రసాంకవ
                 కుంకుమమృగనాభిపంకిలంబు


గీ.

గాన నేదేవళంబు వేంకటనగమున
వెలయఁ గనుపట్టునట్టి కోవెల వసించు
దేవుఁ డలమేలుమంగామనోవిభుండు
దొలఁచు జన్మాంతరానంతదుష్కృతములు.

32

32. చంద్ర = కర్పూరము. సాంకవము = పునుఁగు.

క.

అప్పప్ప చూడవలదా
యప్పని కోవెల పటీరహైమజలంబుల్
కప్పురము పునుఁగు మృగమద
మెప్పట్టున తావి గల్గు భృగుదివసమునన్.

33

33. అప్పప్ప = ఆశ్చర్యవాచకము. భృగుదివసము = శుక్రవారము

సీ.

జన్మజన్మార్జితచటులపంకంబు గో
                 రాడఁ డేవృషభాచలాగ్రవాసి
పక్షంబున దరిద్రభావాహి ద్రుంపఁ డే
                 గరుడవసుంధరాధరవిహారి
యౌషధాసాధ్యవాతాదిరోగంబులఁ
                 దూలింపఁ డేశేషశైలభర్త