పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

రాజవాహనవిజయము

రాండ్రఁగా జేయబడిన సత్యలోకస్త్రీసంఘముచేఁ గల్పింపబడిన చెట్లయందలి తూగుటుయ్యెలయొక్క గురుతులై యొప్పుచుండెడు కడుదాపులనున్న యేలకుతీగెలు కలది. ఇది వేంకటశైలమునకు విశేషణము.

సీ.

ఏచెట్టు చూచిన హితగంధచందనం
                 బేరాలు గనుఁగొన్న నింద్రమణులె
యేజంతు వీక్షింప మృగనాభి మృగరాజ
                 మేదొనఁగన్న గంగోదకంబె
యేతీర్థ మరసిన వృజినద్రుమకుఠార
                 మేచఱియను గన హీరమయమె
యేమండపముఁ జూడ వామాచలోపమం
                 బేఋషి దర్శింప భృగు నిభుండె


గీ.

భోగములకండ యలవేల్పు బువ్వ దండ
పతితులకు బొండ పేదల పైఁడికుండ
తమము రేయెండ విబుధామృతంపుటుండ
కొండమాత్రంబె తిమ్మప్పఁ డుండుకొండ.

31

31. ఏచెట్టు ... భోగములకండ = భోగములు కాస్పదము. అలవేల్పుబువ్వదండ = చంద్రునకు సమీపము. పతితులకు బొండ = పాపాత్ములకు సంకెల. పేదలపైఁడికుండ = బీదలకు బంగారుతో నింపిన కడవ. తమము రైయెండ = అజ్ఞానమనే చీకటికి వెన్నెల. ఇటఁ దమము శ్లిష్టరూపకము. విబుధామృతంపుటుండ = పండితుల కమృతఘుటిక, తిమ్మప్పఁడు = అందమయిన దేవుఁడు.

సీ.

తనపైడిగోపురం బనుదినసేవార్థి
                 గడికి సుమేరు శంకాప్రదంబు