పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

17


గీ.

వ్యాస వాల్మీక శాండిల్య వాలఖిల్య
దేశికుల కెల్ల మంత్రోపదేశకర్త
లరయ నేశైలమున నుంకు లనగ దనరు
నట్టి వేంకటగిరి కొనియాడ దగదె.

29

29. శ్రీఖండ నగపటీరాఖండసౌరభవ్రజము = మలయాద్రియందలి చందనంబునకు బూర్ణమయిన పరిమళ సమూహము. నాసత్య ... జీవాతువు = దేవవైద్యులయొక్క సుఖప్రవర్తనచే యథార్థమయిన వైద్యమునకు జీవనౌషధము. రమ ... కుట్టాకము = మిక్కిలి మనోహరమయినట్టియు శచీకాంతాప్రియుఁడగు నింద్రుని వంటి అనగా నిండ్రునివలె నల్లనయిన మణులకు భేదకములు. ధూర్జటి....స్పర్ధి = శివుని స్ఫుటమగు జడలలోని జడలపంక్తియందున్న యేటితో స్పర్ధ చేయునది. ఉంకులు = ఉనుకులు (ఉనికిపట్లు)

ఉ.

సంకలితాంబుతామరససానుగభీరకుమారదారికా
భ్రంకషనిష్కళంకఝరపాపవినాశనతీర్థసేవనా
ఢ్యంకరణాత్మ భూభువనయౌవత కల్పరసాలకేళి డో
లాంకట సద్విశంకటత రైలము వేంకటశైల మొప్పగున్.

30

30. సంకలిత ... దండాన్వయము. ఒప్పిన యుదకమును బద్మములును గలదియు, చరియలయందలి లోతయిన చిన్నదొనలనుండి వెలువడి యాకసము నొరసెడు తేటయయిన ప్రవాహము గలదియుఁ, బాపమును బోగొట్టునదియు, నైన పుణ్యస్థలములను సేవించుటచే సంపన్ను