పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

రాజవాహనవిజయము


చ.

పలికిన పల్కు లెల్లఁ బరిపాకము దప్పఁగ ఖండశర్కరల్
ఫలములు జున్ను లుక్కెరలు పక్వము లింక మనోహరంబులే
దలఁచిన పద్యమంతయు సుధారసమౌనఁట వేంకటాద్రిరా
ణ్నిలయుని కింకిటం గృతి ఘటింపక మానుట మాకు నేటికిన్.

27

27. పరిపాకము = అంతట పక్వమగుట.

వ.

అట్టి చుట్టుకైదువ జగజెట్టికి విడిచిపట్టయిన పెట్టె
బెట్టు దిట్ట గట్టు కట్టుమట్టు దిట్టతనం బెట్టిదనిన.

28

28. చుట్టుకైదువ జగజెట్టి = చక్రాయుధంబుగల మహాశూరుఁడు. పెట్టెబెట్టు దిటగట్టు = శేషాద్రి, కట్టుమట్టు = కడుదృఢమయిన.

సీ.

శ్రీఖండ నగపటీరాఖండసౌరభ
                 వ్రజదాయి యేగట్టు వంటచెఱకు
నాసత్యసుఖవర్త నాసత్యభైషజ్య
                 జీవాతు వేగట్టు చేదుచెట్టు
రమణీయతరశచీరమణీరమణమణి
                 కుట్టాక మేగట్టు చెట్టుఱాయి
ధూర్జటి స్ఫుటజటాంతర్జటీవాటి సిం
                 ధు స్పర్ధి యేగట్టు దొనల నీరు