పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

15

చుండఁగా విష్ణువు కాపాడెను. అందుచే నాయన చేకత్తి చల్లచేతుల మంత్రసాని, విష్ణు నాభికమలంబున బ్రహ్మయు బ్రహ్మలలాటంబున రుద్రుండును పుట్టినందున నదిశివున కవ్వగారు. జేజేబువ్వక్రొవ్వెదగలయయ్య = చంద్రుఁడు జుట్టునగల దేవుఁడు (శివుఁడు)

ఉ.

ఈక్షితి మున్న సత్కవు లనేకులు హా కవితాలతాంగులన్
లక్షలొసంగియున్కి యధునాతనకావ్యవధూటి వెంకటా
ధ్యక్షుఁడు పాటిసేయఁడు గదా! యన నేటికి నెట్టివానికిం
బక్షము పిన్నభార్యపయిఁ బాయక యుండుట యెంత యెంతయున్.

25

25. అధునాతన = ఇప్పటి.

ఉ.

చెప్పిన పద్యమెల్లఁ జెవిఁ జేర్చి విను న్విన డొంకు గల్గినం
దప్పులు గిప్పు లెన్నఁ డొకనాఁడును నాఁడును నేఁడు వేడుచో
నప్పన నెట్టిపో డఁడగినన్ని వరాలిడుఁ గొండమీఁది తి
మ్మప్పని వంటి కావ్యపతి యబ్బుట యబ్బుర మిబ్బుధాళికిన్.

26

26. డొంకు = సంశయము. నెట్టిపోవు = తోసికొనిపోవు. తిమ్మప్ప - తిమ్మ, అప్ప = అందమయిన యయ్య.