పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

రాజవాహనవిజయము


ఏదేవు చేకత్తి ఋభురాజపౌత్రు భా
                 నుకుఁ జల్ల చేతుల మంత్రసాని
యేదేవు నాభి పూవిగురు జేజేబువ్వ
                 క్రొవ్వెదఁగలయయ్య కవ్వగారు


గీ.

సేవ కేదేవుఁ డొందె నర్చావతార
మట్టి శ్రీ వేంకటాచలాధ్యక్షునకును
బరమమూర్తికి మామకభవ్యకావ్య
కన్య కళ్యాణ మొనరింతు గౌరవమున.

24

24. ఏదేవు... విష్ణు నేత్రద్వయము ' చంద్రసూర్యులగుటచే లక్ష్మీకుటీరపుఁదలుపునకుఁ గుంచెకోలగఁ జెప్పఁబడె. లక్ష్మీకుటీరము ఇయ్యది విష్ణుదృష్టిప్రసరణముచే ముకుళించుచు వికసించుచు నుండు ననుట, కొందఱు మురారికవి మురారి దృష్టిప్రసరణచేఁ దన్నాభికమలము దృష్టిప్రసరణ సమకాలవ్యాప్తిం జేసి ముకుళన వికసన వ్యాపారాశ్రయంబగుటచేఁ దానికి గంబుసన్నిభత్వము సంపాదించెను. గాన తత్కుటీరకవాట మోరవాకిలిగ నుండుననియుఁ గుంచెకోలతో నిమిత్తము లేదనియు మఱి కొందఱు కుడికన్ను మూసి యెడమకంటను నెడమకన్ను మూసి కుడికంటను జూచుచుండుం గానం కుంచెకోల యనగత్యము కాదనియు చెప్పుచుండిరి. విష్ణువు విశ్వరూపుఁడు గాన విశ్వప్రత్యక్షప్రమాణము బట్టి భద్రసూర్యగతి కాలభేదముచేఁ బద్మము ముకుళించుటయు, వికసించుటయుఁ గలుగుచున్నది గావునఁ గుంచెకోల యనుట యవసరమనియే నా యభిప్రాయము. విష్ణుపదమున గంగ పుట్టినదనియు దానికి శివుఁడు మగండనియు నుండుగాథను బట్టి విష్ణుపదాబ్జము శిపునకు సాలంకృతకన్యాదాతగా నభివర్ణించినాడు. కూకుదము = సాలంకృతకన్యాదాత. ఇందిరాపుత్రిక = గంగ. ఇంద్రున కర్జునుఁడు పుత్రుఁడనియుంటచే నభిమన్యుఁడు పౌత్రుండు వానిభార్య యుత్తర; ఈమె గర్భిణిగనుండుతఱి యశ్వత్థామ ప్రయోగించిన పాండవనిర్మూలనాస్త్రము తద్గర్భస్థుఁడయిన శిశువును వేధించు