పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

13

పులివలె హానిచేయువా రనుట. మఱియొకటి = వ్యాళమనఁగా సర్పము దానివలె గుటివర్తనగల వారనియుఁ జెప్పఁదగు, ఇది కాలక్ష్మాతలనేతలకు విశేషణము. క్ష్మాతలనేతలు = రాజులు - నేత్రశబ్దమునకు నేతృలు, నేతలు అనిరూపద్వయము - ఆజ్ఞులు = తెలియనివారు = (అపండితులు) వారితో సతతైకాంతులు = ఎడతెగని రహస్యాలోచన గలవారు మహా ... కులు. గొప్పలైనట్టియు, చేటికానీతములై యైశ్వర్యముల నపహరించునవియైన యుపద్రవములు గలవియు నైన క్రొత్తజాబులు గలవారు.

క.

అవనీశ పిశాచస్తుతిఁ
దవులుటగా దెవ్వియిష్టదైవ మటంచున్
వివరించి “నదైవం కే
శవాత్పర” మ్మను వచనము సత్యం బగుటన్.

23

23. అవనీశ... పిశాచములు - వ్యు. పిశితమును భక్షించునవి. ఇది పృషోదరాదులలోనికి. "నదైవం కేశవాత్పరం” - కేశవునికంటె నన్యంబగు దైవము లేదు. ఈ వచనము మును లొకప్పుడు వ్యాసునిఁగూర్చి ఒకచోట విష్ణువని మఱియొకచోట బ్రహ్మయని యింకొకచోట శక్తియని వేరొకచోట శివుఁడని, యిట్లు నానావిధముల వచింతువు గాన నీమాట నమ్మ వీలులేదనియు నీవు ప్రమాణముమీఁదఁ బలికినం గానీ యంతకు నమ్మఁజాలమని యనఁగా వ్యాసుఁ డప్పు డాలాగుననే ప్రమాణము చేసి చెప్పెదనని వారిం దోడుకొని కాశీవిశ్వేశ్వరస్వామివారి యెదుటికి వచ్చి రెండుభుజములు మీఁదికెత్తి పైన వ్రాసిన వచనమును సత్యమని వచించెను.

సీ.

ఏదేవు కనుదోయి హిమధామసోదరీ
                 కుటికాకవాటంబు కుంచెకోల
యేదేవు చరణాబ్జ మిందిరాపుత్త్రికా
                 కాకోదరాంగదకూకుదంబు