పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

రాజవాహనవిజయము


క.

అనినం బరమానందం
బనువొందఁగ శ్రీనిధాన మబ్బె నటంచుం
గనుదెఱచి యితరులకు మ్రొ
క్కను వెఱచి మురారి చరణఘటితాత్ముఁడనై.

20

20. అనిన ......శ్రీనిధానము = ఐశ్వర్యపుఁబాఁతు శ్రీకి వాసమైనవాడు వేంకటేశ్వరుఁడు.

క.

ప్రతిపద్యప్రతివాక్యో
న్నతికావ్యము రాజవాహనవిజయమఁట యీ
కృతికిం బతి శేషాచల
పతియఁట నేడింతకంటె భాగ్యముగలదే.

21

21. ప్రతిపద్యప్రతివాక్యోన్నతి = ప్రతిపద్యమునందును బ్రతివాక్యమునందును ఔన్నత్యముగలది = ఇది కావ్యవిశేషణము.

శా.

వ్యాళస్వాంతు లశాంతు లజ్ఞసతతైకాంతుల్ మహాచేటికా
శ్రీలోపద్రవసవ్యపత్రికులు భూరిప్రాజ్ఞవిజ్ఞాపనా
వేళాకల్పిత రక్తవక్త్రులు కళావిజ్ఞాననిర్భాగ్యు లీ
కాళక్ష్మాతలనేతలం బొగడుటల్ కష్టంబు లర్థార్థికిన్.

22

22. వ్యాళస్వాంతులు = వ్యాళము = వ్యాఘ్రము దానిమనస్సువంటి మనస్సుగలవారు = ఇందువలనఁ బైకి గోపువలె నుండి