పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

11


సరసవిద్వత్కవిసార్వభౌముని రామ
                 బుధ సంభవునకుఁ బ్రబోధసుధికిఁ
బౌత్రుని పినరామభద్రాగ్రజన్ముడై
                 నట్టి శ్రీరామలింగాఖ్యుఁ దిమ్మ


గీ.

మాంబికకుఁ బుత్త్రు సూర్యనారాయణద్వ
యైకసహజన్ము నుభయభాషాకవిత్వ
తత్త్వనిధి నన్ను మూర్తి విద్వత్కవీంద్రు
హర్షమునఁ జూచి యిట్లని యానతిచ్చె

17

17. కాకమాని గ్రామమున ప్రఖ్యాతుడగు మూర్తికవి వంశవర్ణనము.

గీ.

అనఘమణి కాకమాని రామాహ్వయుండు
నీకు ముత్తాత, యుభయభాషాకవిత్వ
తత్త్వనిధి ప్రబోధుండు పితామహుఁ డిఁక
నీవు కవిపట్టభద్రుండ వెవ్వరీడు.

18

18. అనఘమణి = నిర్దోషులలో శ్రేష్ఠుడు.

క.

కృతిలో బ్రతిపద్యచమ
త్కృతి గలుగఁగఁ బలుకనేర్చు కృతి నీవు మహా
కృతి మాకొనరుచు భాషా
కృతి భారవి కాకమాని శ్రీమూ ర్తికవీ!

19

19. కృతి = కవిత్వంబు నొనర్చుట, విద్వాంసుఁడు, అంకిత మిచ్చుట. భాషాకృతి = వాగ్దేవతాస్వరూపుఁడౌ, భారవి = కాంతికి సూర్యుఁడౌ