పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

రాజవాహనవిజయము


మును మ్రింగిన దవాగ్ని నన వచ్చెనా నురోం
                 గణమునఁ గౌస్తుభమణి వెలుంగ
నలిక పత్రాంత్యద్వయలిఖతశ్రీల క్రిం
                 దటి పూలన శ్రుతికుండలము లమరఁ


గీ.

జల్లచూపుల కాంతామతల్లి నాదు
తల్లి యలమేలుమంగ కెదండఁ గొనుచు
బన్నగ నగాఢ్యుఁ డేనింత కన్నుమోడ్చు
తరిని గలలోన నెదుటఁ బ్రత్యక్షమయ్యె.

15

15. గల్లకావి = నీరు కావి, అంశుకంబు = వస్త్రము, విష్ణువు కృష్ణావతారమునఁ గాఱుచిచ్చు మ్రింగెను. నన = చిగురు, యిట పత్రికాంత్యంబుల రెంటను వ్రాసిన శ్రీకారంబులు చెవులక్రించనున్న పూలవలె గుండలంబు లుండెను.

క.

ప్రత్యక్షంబై నాపైఁ
బ్రత్యక్షరహృద్యగద్యపద్యసముద్య
త్కృత్యక్షయరచనాబ్దా
ప్రత్యక్షమఫణితిఁబైఁ గృపారస మొల్కన్.

16

16. ఆబ్ద, అప్రతి, అక్షమ, ఫణితిన్ = మేఘము యొక్క అసమానమును, సహింపరానిదియు నైన ధ్వనితో.

సీ.

గుణధన్యు గౌండిన్యగోత్రు నాపస్తంబ
                 సూత్రుని వెలనాటి గోత్రచరితుఁ
గాకమానీమహాగ్రామాబ్జమిత్రుఁ బె
                 న్నేకులవార్ధితారాకళత్రు