పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

9


గీ.

పరవినీతప్రబంధముల్ భంగపఱుప
మొగిసి ప్రాసంబు చేతనే మోసపోవు
సాధుజనసంచితపదార్థచౌర్యరతుఁడు
మైత్రికి నమైత్రికిని ధాత్రిఁ బాత్ర మగుచు.

13

13. కుకవికిని దొంగవానికిని అభేద్యము. ఎఱింగింపఁడు = శబ్దరచన తెలియకుండునట్లు చేయును, చోరుఁడు నిశ్శబ్దముగ నుండును. తమిని = కోరికతో, రంధ్రాన్వేషణము = లోపములు వెదుకుట, రాత్రియందు కంతలు వెదుకుట, శబ్దంబు = మాట, ధ్వని, కళానిధి = పండితుడు, చంద్రుడు, దర్శనము = శాస్త్రము, చూడ్కి, మొదలేరుపడ పాదంబులు ప్రయోగింపఁడు = పద్యపాదములు సరిగా నుంచఁబడవు, ముంగాళ్ళమీఁద నడచును. కులదీపకుల నసహ్యించుకొనును = దీపములు చూడ నిష్టపడఁడు. తెలివిలేనివారికడ నలంకారసత్కారమును బొందును. మెలకువ గనివారి యిండ్ల సొమ్ములు దోఁచును. రసము = గుణము (శృంగారాదులు), ప్రేమ, ప్రబంధములు = గ్రంథములు,కట్లు, ప్రాసము = పద్యపాదద్వితీయాక్షరము, ఈటె, పదార్థంబులు = పదములు, అర్ధములు, ద్రవ్యములు.

వ.

అని యిష్టదేవతావందనంబును, శిష్టకవిజనాభినందనంబును, దుష్టకవి నిందనంబును గావించి యొక్కకావ్యకథనంబునకు గ్రథనంబు సమకట్టియున్నసమయంబున.

14

14. గ్రథనంబు = కూర్చుట.

సీ.

తన తనూరుచిపైనిఁ దగ నుల్లసిలు గుల్ల
                 కావినాఁ గనకాంశుకంబు దనరఁ
గరముల శంఖచక్రంబులు భుజముల
                 వ్రాలిన హంస చక్రములఁ దెలుప