పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

రాజవాహనవిజయము


చ.

ప్రబలమతి న్నుతింతుఁ బ్రతిభాశ్రుతిభాషితభారతీంద్రులం
గబళితసర్వదర్శనులఁ గావ్యచమత్కృతి కాళిదాసు ల
న్నిబిడతపోవిలాసులఁ దృణీకృతవాదులఁ గాకమాని రా
మ బుధవిభుం బ్రబోధసుధి మత్ప్రపితామహునిం బితామహున్.

12

12. ప్రతిభాశ్రుతిభాషితభారతీంద్రులు = బుద్ధివిశేషమందును, వేదవాక్కులయందును, బ్రహ్మదేవులు, దర్శనము = శాస్త్రము. మూర్తికవియొక్క ప్రపితామహుఁడు రామనాముఁడు, పితామహుఁడు ప్రబోధనాముఁడు.

దుష్టకవి నిందనము

సీ.

తన వచోరచన లెంతయు నెఱింగింపఁడు
                 తమిని రంధ్రాన్వేషణమున కుబ్బు
శబ్దబు నెరపు నెచ్చటికిఁ జేరఁగరాఁడు
                 నలినకళానిధి దర్శనమున కులుకు
మొదలేరుపడఁ బాదములు ప్రయోగింపఁడు
                 కులదీపకాసహ్యగుణము లెంచు
బోధచోరులయిండ్ల భూషణంబులు దాల్చు
                 సరసవిద్యవిచారగరిమఁ జనఁడు