పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

7


గీ

భాష్య మెవ్వఁ డొనర్చె శబ్దంబుకొదువ
లడఁచెఁ బాణిని మునికిఁ గాత్యాయనునకు
జయము సారస్వతము నాకు స్వప్నమున నొ
సంగినాఁ డెవ్వఁ డవ్వేల్పు సన్నుతింతు.

9

9. కదలనివిరివిమోపు = భూమి, జవికె = తేలికపఱిచె. సుత్తెవాటుల వారు లెత్తనిసొమ్ము = సుత్తిదెబ్బచేఁ బీటెత్తనిసొమ్ము శేషాభరణ మనుట. శిఖి...విల్లు = మేరువు రామహతధనుఁడు, శివుఁడు పూర్వ మొకప్పుడు వాయువుచే మేరు వెగిరిపోకుండునట్లు శేషుఁడు, వలగొని కాపీడినట్లు పురాణగాథ గలదు. కాత్యాయనుఁడు = వరరుచి.

గీ.

సూత్రవార్తికభాష్యముల్ సొరిదిఁ జేసి
నట్టి పాణినిమౌనిఁ గాత్యాయనర్షి
శేషభోగిని సన్నుతుల్ చేయువాఁడఁ
జతురశబ్దప్రయోగ్యతాసంపదలకు.

10

10. శబ్దప్రయోగచాతుర్యమునకై పాణిని, కాత్యాయనాదులను స్తుతించుచున్నాడు.

ఉ.

శ్రీరఘురామకావ్యకృతి సిద్ధవిధిజ్ఞుఁ బరాశరాత్మజున్
భారవిఁ గాళిదాసు శివభద్రు మురారి మయూరు బిల్హణుం
జోరుని మల్హణాది సురసూక్తికవీందుల గొల్చి యెంచెదన్
భారతకర్తృతాచరణు నన్నయఁ దిక్కన నెఱ్ఱనార్యునిన్.

11

.