పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

రాజవాహనవిజయము


బరువు తానెఱిఁగిన శరముచుల్కఁగ జేసి
                 మృడునకుఁ బురజయం బిచ్చినాఁడు
ద్విరసనాళికివేల్పు వెనుసూటి సుధనాచి
                 రెల్లులో నట పారజల్లినాఁడు


గీ.

పక్ష మెడలింప మెడఁద్రొక్కి పట్ట నంప
కట్టపాల్సేయఁ దనుగన్నయట్టినారి
కపకృతి యొనర్పసుమ్ము కృతాపరాధుఁ
బ్రోవనన్నాఁడె నను నేఁడు పులుగుఱేఁడు.

8

8. గరుత్మంతుడు నిజాపరాధుల కపకృతిచేయక యుపకారమే చేసెను. అపరాధినైన నన్నుమాత్రము రక్షింపడా! ఇంద్రుడు ఱెక్క తేగవ్రేయవచ్చినను, గాద్రవేయులు మెడద్రొక్కుచుండినను, రుద్రుఁడు బాణముపాలు చేసినను ,తనవారికి (ఉరగులకు) దేవతలు అపకృతి చేయుచున్నను, వారికి వరుసగా నొక యీక నేరాల్చెననియు, గ్రింద బడవేయక కాద్రవేయులను మోచెననియు, రుద్రునకుఁ ద్రిపురవిజయ మిచ్చెననియు దేవతలను సుధ తిరుగఁ దీసికొనిపోనిచ్చెననియు, నభిప్రాయము.

సీ.

బలదూది నింపని పరుపుపెం పెవ్వాఁడు
                 సవరించె వటపత్రశయనునకును
గదలని విరివిమో పది మోచి భారంబు
                 జవికె నెవ్వాఁడు విశ్వంభరునకు
సుత్తెవాటుల వారు లెత్తనిసొమ్ము సొం
                 పలరించె నెవ్వాఁడు సాంబునకును
శిఖిముఖంబున వన్నెజిగిఁజల్లు విల్లెవ్వఁ
                 డందిచ్చె రఘురామహతధనునకు