పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

5


సీ.

జలరాశిలంఘనోజ్వలజవంబున నెవ్వఁ
                 డలరె మరున్మనోహరత దోఁప
లంకాహరణవేళ లలితాత్మ శౌర్యంబు
                 మున్నెవ్వఁ డకలంకముగ ఘటించె
ముద్రిక నిజశిరంబునఁ దాల్చినాఁ డెవ్వఁ
                 డిల రామమహిజానిహితము గాఁగ
లక్ష్మణప్రాణానిలము నిల్పె నెవ్వాఁడు
                 తనదు గాత్రంబు పావనము గాఁగ


గీ.

నట్టిరఘురామసూచనాహర్షబాష్ప
మోచనాఖండగండాభిషేచనాంత
లోచనాంతరరుచిచారులోచనాంతుఁ
జంద్రగిరికోట హనుమంతు సన్నుతింతు.

7

7. మరున్మనోహరత = దేవతల కింపయ్యెననియు తండ్రియగు వాయుదేవుఁడు సంతసించెననియు, అకలంకముగ = నిష్కలంకముగ ననియు, సుకరహితమైన లంకగలదిగఁ జేసెననియు, ఈయన గాత్రము పవనసంబంధము గానఁ బ్రాణానిలంబు నిల్పెనని భావము. రఘురామ...నాంతు = రాములవారు చేయు సన్నలవలననైన యానందబాష్పములయొక్క విడుచుటచేఁ దెంపు లేని గండాభిషేచనంబు అవధిగాగల నేత్రంబులలోని కాంతిచే నందమైన కనుగొలుకులుగలవానిని.

సీ.

జంభారి దంభోళి ఝళిపించి నిప్పుకల్
                 రాల్చిన నొకయీక రాల్చినాఁడు
జగములెల్ల నడంగఁ జరియించు నల్లని
                 మో పవలీలమై మోచినాఁడు