పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

రాజవాహనవిజయము


పచ్చ నిజాసనంబు గనుపట్టిన మార్కొను దంతియంచుఁ గొ
మ్మిచ్చు గజాస్యు డిచ్చు కృతి కిష్టవచోరచనాచమత్కృతుల్.

5

5. అచ్చికన్ = కొరంతతో, వినాయకునకు శిరస్సునఁ చంద్రశకలమున్నది. "బాలేందుశకలోత్తంసం వందేహం గణనాయ" కమ్మని యున్నందున నందలియమృకము నెత్తిపై జల్లుకొన్న పాలుగ జెప్పఁబడెను .

ఉ.

చోరు నలంక్రియావిహృతిసొంపు మయూరిని సౌకుమార్యమున్
భారవి కాంతిసంపదయు బాణుగుణాఢ్యతరప్రయోగ మా
దారి మురారికోమలపదంబు ప్రసాదము గల్గునట్టుగా
భారతి యిచ్చుఁగాతఁ బ్రతిభారతి మత్కృతికిం జమత్కృతిన్.

6

6. చోరుఁ డలంకారములు సంగ్రహించుననియు, మయూరినియందు సౌకుమార్య మున్నదనియు, భారవికిఁ (సూర్యునకు) గాంతిసంపద గలదనియు, బాణమునకు గుణ సంబంధంబును బ్రయోగవైచిత్ర్యంబును గలదనియు, మురారి (విష్ణువు) ఈయనకు పద్ + అంబు= పాదమండలి నీటి స్వచ్ఛత గలదనియు, స్వభావోక్తి గ్రహించుటచే చోరకవికవిత యుపమాద్యలంకారభూయిష్టమనియు, మయూరకవికవిత సుకుమారము అనఁగా మృదుశబ్దభూయిష్టమనియు, భారవికవిత ప్రకాశంబు గలదనియు, బాణకవిత్వంబు ప్రయోగలక్షణ సమృద్ధిగలదనియు, మురారి కవిత మృదుపదభూయిష్టమనియు గ్రహింపవలయును. ప్రతిభ = బుద్ధివిశేషము.