పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

3

సంగతిని సరస్వతికి దెల్పి మాటుచున్నాఁడు. పంచవక్త్ర = అయిదుమోములు గలది. (విశేషము వాక్కులు గలది, చతురాస్యుడు = నాలుగుమోములు గలవాఁడు, చతురమైన వాక్కులు గలవాఁడు.)

సీ.

ఇందిరామదిరాక్షి క్రీడాపు నీలంపు
                 మేడచుట్టు ప్రహారీగోడ యనఁగఁ
దనచేతి కెల్లప్పుడును లోనుగా రమా
                 తరుణి వైచిన వలత్రా డనంగ
నలమేలుమంగ సయ్యాటంబునకు వైవఁ
                 దాల్చిన పొగడపూదండ యనఁగ
మున్నీటికన్నియన్ పెన్నిధానంబు దూ
                 గుటకు వైచిన యట్టి గొలుస నంగ


గీ.

భరితకౌస్తుభదినమణిపరిధి యనఁగఁ
దనుఘనాశ్రిత మఘవకోదండ మనఁగ
వేంకటాధీశునురముపై వినుతిఁ గనిన
వైజయంతిక మాకిచ్చు వైభవములు.

4

4. లక్ష్మికి విష్ణువక్షస్థలము నీలపుమేడగఁ జెప్పఁబడెను. పరిధి = సూర్యచంద్రులచుట్టు కట్టుగుడి. విష్ణువు వక్షస్థలమందుండు కౌస్తుభరత్నమనెడు సూర్యునకు వైజయంతికామాలిక పరివేషముగనుండెను. కుస్తుభము = సముద్రము. అందుఁ బుట్టినది కౌస్తుభము.

ఉ.

అచ్చికఁ జన్ను ద్రావుటకు నౌఁదల భూత్కృతిఁ జల్లుకొన్న పా
లచ్చటఁ గ్రొన్నెలందగు సుధావళి దెల్పఁగ గౌరితాళి బల్