పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

రాజవాహనవిజయము


మ.

మెగమున్ మైసగమున్ సగౌరవగమున్ మేరూజ్జ్వలజూటప
న్నగమున్ మిక్కలి కన్నుఁ గన్న మొగమున్ హర్మ్యాయితానేకపా
దగమున్ గొమ్ములఁ జిమ్ముమేల్తురఁగమున్ యాదోధిరాణ్నిద్రితా
శుగము్ రాజిలురాజు మాదృశుల కిచ్చున్ శాశ్వతైశ్వర్యముల్.

2

2. అనేకపాద్+అగము= వటవృక్షము, శివుడు దక్షిణామూర్తిలీలయందు వటవృక్షముక్రింద సనకాదిమహాఋషులకుఁ దత్త్వోపదేశము చేసెను. ఆశుగము = బాణము. గాలి త్రిపురసంహారకాలమందు శివునకు విష్ణుబాణమయ్యెను, మెగము = మెకము.

ఉ.

సుద్దుల కన్నెకన్నుగవ చొక్కపుఁజెక్కులు మోవి నొక్క మై
ముద్దిడువేళ మోవికిని మోవికొఱంతఁ దలంచి వేలుపుం
బెద్దకుఁ బంచవక్త్రుఁ గనిపెంచిన మేటికి బంచవక్త్రవౌ
దద్దిర! యంచు నవ్వుచతురాస్యుడు మాకుఁ జిరాయు వీవుతన్.

3

3. శివుఁడు భైరవలీలయందు బ్రహ్మ యొక్క యైదవతలను ద్రుంచినందున బ్రహ్మ సరస్వతి మొగము ముద్దుబెట్టుకొనునప్పు డావెల్తిని బంచవక్త్రుఁడు (శివుఁడు) ఒకప్పుడు తన లలాటమునఁ బుట్టిన