పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ

పరమాత్మనే నమః

ఇష్టదేవతాస్తవము

(కాకమానిమూర్తి ప్రణీతము)

శ్రీయధరోపరిం గుచగిరిం గబరిం దరహాసవీటికా
చ్ఛాయల యింపుసొంపులయి చందనకుంకుమపత్రరేఖలై
యాయతకుందచంపకము తగఁ గన్గొను వేంకటేశ్వరుం
డా యిరుగంటిచూడ్కి భజనార్థి తమంబు నదల్చుగావుతన్.

1

1. విష్ణుఁడు చంద్రసూర్యలోచనుఁడు గావున నాయన చూడ్కులు (చంద్రసూర్యాతపములు) లక్ష్మీదేవ్యధర కుచ కబరులయందు వరుసగా దరహాసవీటికాచ్ఛాయలుగను చందనకుంకుమపత్రరచనలుగను గుందచంపకములుగను శోభిల్లెననుట.