పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

267

యోధులుగలవాఁడా, రథీ = రథికుఁడైనవాఁడా. మా = జయలక్ష్మియొక్క. ధుర్య = భారమును వహించిన. స్తవ = స్తోత్రముతోడ. యుక్త = కూడినవాఁడా. రంగపురసీమా = శ్రీరంగస్థలము. ఆధార = నివాసము గలవాఁడా. మా = లక్ష్మిని. ధారకా = ధరించినవాఁడా.

క.

అలమేల్మంగాపాంగా
చలచంచచ్చంచలాభిజననసముద్య
త్కలికాశ్రువర్షహర్షిత
పులకాంకురసస్యకృష్ణభూసదృశాంగా.

105

105. అలమేల్మంగయొక్క, అపాంగ = క్రేఁగంటిచూపనెడు. అచల = అంతటను గదులుచున్న. చంచత్ = ప్రకాశించుచున్న. చంచలా = మెఱుపుయొక్క. అభిజనన = పుట్టువు చేత. సముద్యత్ = పుట్టుచున్న. కలికా = మొగ్గలవంటి. అశ్రు = ఆనందబాష్పములయొక్క. వర్ష ము చేత. హర్షిత = గగురుపొడిచిన. పులకాంకురములనెడు. సస్య = చేనికి. కృష్ణభూసదృశ = నల్లనేలతో సమానమైన. అంగా = శరీరముగలవాఁడా.

పృథ్వీవృత్తము.

ధరాధరధనుర్ధనుర్దళనలబ్ధసీతారుగా
ధరాధరధరాధరాధరణధన్యబాహావితా
పరాధరహితాఖలప్రభలభూసురాగ్రేసరా
సరాధరవినందనాంచలవిహారపారాయణా.

106

106. ధరాధర = పర్వతమే. ధనుః = విల్లుగల శివునియొక్క. ధనుః = వింటియొక్క. దళన = విరచుటచేత. లబ్ధ = పొందఁబడిన. సీతా = సీతాదేవి యనునట్టి. అరుణాధర = స్త్రీ గలవాఁడా. ధరధరా = గోవర్ధనపర్వతమును ధరించినవాఁడా. ధరా = భూమియొక్క. ధరణ = ధరించుట.