పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాజవాహనవిజయము

266


సంభూషింప సమస్తరాజ్యపదవీసౌఖ్యంబుఁ జెందెం దగన్.

103

103. అంభోధిప్రియసంభవ = సముద్రుని యిష్టపుత్రుఁడైన చంద్రునియొక్క. అన్వయుఁడు = వంశముగలవాఁడు. జంభారిక్రియన్ = ఇంద్రునివలె.

ఆశ్వాసాంతము

శా.

ఆధివ్యాధివిరోధికీర్తనతరంగాధార గాధారమా
ప్రాధీనస్తుతిధీరవాగమృతధారాధార రాధారసీ
యోధైర్యచ్యుతికృద్ధృతీ క్షతమహీయోధారయోధారథీ
మాధుర్యస్తవయుక్తరంగపురసీమాధారమాధారకా.

104

104. ఆధి = మనోవ్యధకును. వ్యాధి = రోగమునకును. విరోధి = పోఁగొట్టునాట్టి, కీర్తనతరంగ = తరంగములవంటి స్తోత్రములకు. ఆధార = ఆధారమైనవాఁడా. గాధారమా = ప్రతిష్టాలక్ష్మికి. ప్రాధీన = స్వాధీనమైన. స్తుతి = స్తోత్రముగల. ధీర = విద్వాంసులయొక్క. వాక్యామృతధారను ధరించువాఁడా. రాధా = రాధాదేవియొక్క. రసీయః = మిక్కిలిరసముగల. ధైర్యము యొక్క జారడమును జేయునట్టి సంతోషముగలవాఁడా. క్షత = కొట్టఁబడిన. మహీయః = మిక్కిలి విస్తారమైన. ధార = కత్తియంచులుగల. యోధా =