పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

268

రాజవాహనవిజయము

చేత. ధన్య - కృతార్థమైన. బాహా - భుజముచేత. అనిత - రక్షించబడిన. అపరాధరహిత - నేరము లేని. సరాధ - రాధతో గూడినవాఁడా. రవినందనాంచల - యమునాతీరమందు. విహార - క్రీడించుటయందు. పారాయణా - ఆసక్తుఁడా.

ఇది శ్రీరామభద్రభజనముద్రకవి పట్టభద్రకాద్రవేయాధిప
వరసమాగత సరససారస్వతలహరీ పరిపాక కాకమానిమూర్తి
ప్రబోధబుధకవి సార్వభౌమపౌత్ర రామలింగభట్ట
పుత్ర కౌండిన్యగోత్ర భాగధేయమూర్తి
నామధేయప్రణీతం బైన రాజవాహనవిజ
యంబను మహాప్రబంధంబు నందు
సర్వంబును పంచమాశ్వాసము.
సంపూర్ణము.
శ్రీ శ్రీ శ్రీ