పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

258

రాజవాహనవిజయము

88. చదురుల్ = చతురవాక్యములు.

క.

పడఁతుల వెంటనె ప్రియసతి
నడిఁ జనఁ బడవైవఁగాఁ గవాటము సందిం
బడి యొక్క తె జడ జిక్కెం
గడు విభు నెద నాటు మదనఖడ్గముఁ బోలెన్.

89


క.

రమణీరత్నం బయ్యెడ
రమణుఁడు చేయంటి లాఁగ రాక మణిస్తం
భము వట్టి పెనఁగి తరువ
ల్లిమతల్లిక చెల్వునఁ గదలెను దమకమునన్.

90


మ.

కులుకుం దోరపుగుబ్బ లంటుదునొ తళ్కుం బెన్నెరుల్ వట్టి కెం
దలిరుందేనియమోవి యానుదునొ యందంపుందనూవల్లికన్
సొలయం గౌఁగిటఁ జేర్తునో కనుగవం జుంబింతునో యంచు మిం
చొలయన్ రాజు మనం బపూర్వకృతి కిట్లుఱ్ఱూత లోగెం గడున్.

91


క.

ధరణీరమణుఁడు పయ్యెద
సరవిం గొని తివియ మగువ స్వస్తికబంధో
ద్ధురబాహాంతర యగుచో
స్మరసంగరమునకు మల్ల చరుచుటఁ దెల్పెన్.

92

92. స్వస్తికబంధ = చేతు లొండొంటితో దండచేతులు బట్టుట. బాహా = భుజముల యొక్క. స్మరసంగరమునకున్ = మన్మథ