పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

257

కన్ను = నేత్రములుగల పిల్లి. బవంతి = రాజగృహము. బోదెలు = అరుగులు. మెట్టుకలు = మెట్లు. కేలుమెకము = ఏనుఁగులయొక్క. దోయి = జోడు. ఉప్పరిగ = చప్పరము,

సీ.

పసిమిబంగరుతీగెపనులచే దీరిన
                 తావు సూర్యపటంబు దగు కురాళ
మింత పైకెక్కిన యెకరంగి పరుపఱు
                 పైకుంకుమ పుటంబు పటపుపోయి
మురువొప్ప గొప్ప చప్పరకోళ్ళమంచంబు
                 వలప్రక్క వక్కలాకులుఁ జెలంగ
జాళువా జలపోత , జాలవల్లిక తూర్పు
                 చెంగటఁ గొరలు ప రంగిపీట


గీ.

దండ జముకాణమునఁ జేర్చు దండెయును బ
సిండి బురుసా మిసిమి గవిసెన సడలుచు
నిద్దపు విపంచియును నిల్వుటద్ద మమర
బడకయిలు జొచ్చె నప్పు డప్పుడమిఱేఁడు.

87

87. సూర్యపటము = మేలుతరమైన మొకములు. కురాళము = చప్పరము. ఎకరంగి = చిత్రపురంగు గలది. పరువఱు = పరుపుదగ్గఱ. చప్పరకోళ్ళు - తరుమణికోళ్ళు. జలపోత = మలామా. జాలవల్లిక = తమలపాకులకట్ట. పరంగిపీట = హూణదేశపుపీట. జముకాణము = జంబుఖానా. దండె = కిన్నెర. బురుసా = ఎఱ్ఱపట్టు. గవిసెన = గుడ్డతొడుగు. విపంచి = వీణ.

క.

అచ్చటి కయ్యెడ వచ్చిన
నెచ్చెలు లచ్చెలువఁ దెచ్చి నృపుతోఁ జదురుల్
పచ్చిగ నాడుచుఁ బొడుచు
మచ్చిక నొకరొకరె పనుల మరుగున జరుగన్.

88