పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

256

రాజవాహనవిజయము


పేటీహస్తకలాచికావ్యజనముల్ పెంపార నేతేరఁగా
శాటీభూషణపేటీకాకనకచంచన్మంచపాటీరధో
ర్వాటీకంబుల మాగధుండు నిజగేహంబు బ్రవేశింపుచున్.

85

85. చేటికోటి = దాసీసమూహము. కటీతటీపటసమాశ్లిష్ట = ఒడియందుంచబడిన. వీటికాపేటీ = పాందానులు. కలాచికా = తమ్మపడిగె. అటీకంబులన్ = ఆతిశయములచేత.

సీ.

పగడంపుముక్కులఁ బచ్చరెక్కల నిక్కు
                 చిలుకల మదనచేతుల ఘటిల్లు
పటికంపుగుండుగంబము తళత్తళరుచుల్
                 దరిఁ జేర్చు దంతంపుదంతె లింపు
పొసఁగు రాజావర్తపుంబారువములకు
                 బొంచు వైడూర్యంబు మించు గన్ను
మగఱా గొనబు వెల్లి నిగనిగల్ గనుపట్టుఁ
                 వగచుట్టుఁ జుట్టుఁ బవంతిలోనఁ


గీ.

బద్మరాగంపు బోదెల పడకటింటి
సన్నసున్నంపుఁ దిన్నియ చందుచుట్టు
మెట్టుకల నీలపుంగేలు మెకము దోయి
పరఁగి యొప్పారు గొప్ప యుప్పరిగ కరిగి.

86

86. మదనచేతులు = మిద్దెకడ్డీలు. గుండుగంబము = గుండ్రముగానున్న స్తంభము. దంతెలు = స్తంభపీఠములు. రాజావర్తము = మణివిశేషము. పారువములు = పావురములు. పొంచు = పట్టుకొనుటకుఁ గాచియున్న. వైదూర్యంబుమించు = వైడూర్యకాంతిగల.