పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

259

యుద్ధమునకు. మల్ల చరచుట = ఎడమచెయ్యి బ్రక్కను వంచి కుడిచేతితో దండపైఁ జరచుట.

సీ.

ప్రార్థనాదృతవధూవదనఖండితనాగ
                 వల్లీదళార్థచర్వణచణుండు
ఘనహారమణిపరీక్షామిషాంబురుహేక్ష
                 ణాపయోధరబోధనక్షముండు
తరుణీమణీకారితస్వాంగపరిరంభ
                 ణౌద్ధత్యకృచ్ఛివదాంకపాళి
ఘనసారవీటికాగంధగ్రహణదంభ
                 మానిన్యధరసుధాపానతతుఁడు


గీ.

కాంచికాస్థలవైకృత్యగళనకటక
యవతి నీవి విమోచనోద్యుక్తుఁ డగుచు
నవరతానందుఁడైన మానవపతీంద్రుఁ
డాతఁ డనవరతానందుఁ డయ్యె నపుడు.

93

93. ప్రార్ధనా = బ్రతిమాలుకొనుటచేత. అదృత = ఆదరించఁబడిన, వధూ = అవంతియొక్క. వదన = ముఖముచేత. ఖండిత = కొరకఁబడిన. నాగవల్లీదళ = తమలపాకుయొక్క. అర్ధ = ముక్కయొక్క. చర్వణచణుండు = నమలుటతోఁ కూడినవాడు. కారిత = చేయించఁబడిన. స్వాంగపరిరంభణోద్ధత్యకృత్ = తన శరీరాలింగనమందలి దురుసుతనమును జేయునట్టి. శివద = సుఖమునిచ్చునట్టి. అంకపాళి = ఆలింగనము గలవాడు. కాంచికా = మొలనూలుయొక్క (అనఁగా నొడ్డాణముయొక్క) స్థలవైకృత్య = స్థలభేదముచేత. గళన = జారుటగల. కటక = పిరుందుగల. నవరత =నూతనసంభోగమందు. అనవరత - ఎడతెగని.

చ.

తిలకినిభర్త దెల్పఁ జవిఁ దేలి రతిం బతిఁ బూరుషాకృతిం