పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

229

భయపడి. యధాయధలు = చెదిరిపోయినవి. గగనమణి = సూర్యునియొక్క. ఘృణి = కిరణములవంటి. మండలాగ్ర = కత్తియనెడు. దవధనంజయ = కార్చిచ్చుయొక్క.

క.

దగదొట్టి కలన బెట్టిన
మగఁటిమి వెన్నిచ్చి పారు మాళవ నృపతిన్
మగధపతి యట్టితతి నా
శుగతి న్వెన్నాడి కోటఁ జొరదోలి వడిన్.

16

16. దగదొట్టి = దాహముగొని, అట్టి తరిన్ = ఆసమయమందు. ఆశుగతిన్ = వేగిరపునడకచేత.

చ.

అటుల జయంబుఁ గాంచిన ధరాధిపయోధులు వంకదార మి
క్కుటముగఁ జొచ్చిరాఁగ విని గొబ్బున వైచిరి వీఁటికోటవా
కిటి భటు లంత మాగధునికిం గల బం ట్లిరుగంట నిప్పుకల్
చిటచిటరాల నేనుఁగులచేరువ కానికిఁ బంపు వెట్టినన్.

17

17. వంకదార = కోటవాకిటి వంకత్రోవ. వైచి = తలుపు వేసిరి. నిప్పుకల్ = అగ్నికణములు. చేరువ = సమూహము. యేనుఁగులచేరువకానికిన్ = గజసేనానాయకునికి. పంపువెట్టినన్ = నీపనియని చెప్పఁగా.

క.

గోపురకవాటపాటన
నైపుణచణచరణవారణసమారోహో
ద్దీపితభాషావరసం
జ్ఞాపటుగతి మావటీఁడు చనుదెంచె వడిన్.

18