పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

228

రాజవాహనవిజయము


మ.

భటులం గీటణఁగించి ఘోటకములన్ భర్జించి భద్రేభరా
డ్ఘటలం జెక్కలుచేసి సైనికశతాంగశ్రేణి నుగ్గాడి యు
ద్భటకాలానలకాలకంఠనిభజాగ్రద్విక్రమోదగ్రుఁడై
దిటమై మాగధుఁ డొప్పిన న్మరలె భీతి న్మానసారుం డనిన్.

14

14. ఘోటకములన్ = గుఱ్ఱములను. ఘటలన్ = యేనుఁగుసమూహములను. కాలకంఠ = రుద్రుఁడు. దిటమై = దృఢమై.

సీ.

గడగడ వడకి నల్గడ ల్విడచి క
                 కాపిక లైపోయె గడల పౌజు
చేతిక్రోవులు వైచి భీతిఁ జైవులు జారె
                 బగ్గము పాడై తుపాకిమూక
కేడెముల్ విడి మాని వేడెముల్ పంచ
                 బంగాళమై పారె గుఱాలబారు
కర మెత్తి ఘీంకారభర మెత్తి పరువెత్తి
                 యళికి యధాయధ లయ్యెఁ గరులు


గీ.

గగనమణిఘృణి విక్రమక్రమధురీణ
మగధ మహిధవ భుజదండమండలాగ్ర
దవ ధనంజయ ధగధగద్ధగల బెగడి
మానసారుండు వెనుకముందైన యపుడు.

15

15. గడలు - కొవ్వీటెలు. క్రోవులు = తుపాకులు. కేడెముల్ = డాళ్ళు. వేడెముల్ = శౌర్యములు. అత్తి = పొంది. అళికి =