పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

227

ఉక్తిన్ = వాక్యమును. పేరుబెట్టినచాయన్ = మారుపేరు బెట్టినచోట. హేతి = కత్తి. దంట బెట్టినవారిన్ = దండెత్తి వచ్చినవారిని. దండము = నమస్కారము. ఉట్టినవారికిన్ = ఉట్టుధాతువునకు జారుట అర్థమైనను ఇక్కడ లక్షణచేత అర్పించుట చెప్పవలెను. శయ = హస్తముయొక్క. రణవిహరణ = యుద్ధవిహారమందు. అధ్వరధ్వంసి = రుద్రుడైన.

సీ.

అఖిలసీమామూల మైనదుర్గమ్ము లు
                 మ్మలికలు గల కమ్మ వెలమ దొరలు
చేతి కైదేసి వేల్ శివరాయల వరాల
                 నెలకట్టడల పటాణీ ల్గరీబు
లూళ్ళాయములమీఁద హొరపుత్తరువు గన్న
                 రాయ కైజీతంపురాయవారు
పగటిగాసంబు దప్పకయుండ దినరోజు
                 మాదిరి నొంటిరి జోదుమూక


గీ.

మొదలుగాగఁల బారులు మొనకు నిచ్చి
పొడిచి పేర్వాడి వీథు లేర్పడఁగఁ జేసి
గాసిఁ గావించి యరులఁ జేవాసియెదుట
జూపి నిలరేఁడు మూడు మెచ్చులునమెచ్చ.

13

13. సీమామూలమైనదుర్గమ్ములు = దేశపుసరిహద్దుకోటలు. ఉమ్మలికలు = మొఖాసాలు అని తోఁచుచున్నది. శివరాయలవరాలు = వరహాలలో భేదము. నెలకట్టడలు = నెలజీతములు, పటాణీలు. గరీబులు = ఆయాదేశస్థులు. ఊళ్లాయములమీద హొరపుత్తరువుగన్న = గ్రామము సొమ్ముల దస్తు చేయుటకు హుకుమును బొందిన. రాయ కైజీతపురాయవారు = నెలజీతములు లేకుండా గొప్పగొప్ప ముజరాలు గల అధికారులు. పగటిగాసంబు దప్పక యుండన్ = బత్తెము మానకుండగా. దినరోజుమాదిరిన్ = ఏరోజుసొ మ్మారోజే ముట్టే పద్ధతినున్న. ఒంటరిజోదు = అసహాయశూరులైన యోధులయొక్క