పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

226

రాజవాహనవిజయము


జరిగినఁ గేసరిప్రకృతి నమ్మగధుండును మాళవేంద్రుపై
దుర మొనరించె మాళవుఁడు దోడనె జాంబవదాకృతి న్భుజా
సరసతఁ జూప మాగధుఁడు జాంబవతీపతి భాతిఁ బోరుచున్.

11

11. జాంబవదాకృతిన్ = జాంబవంతునివలె. జాంబవతీపతి భాతిన్ = కృష్ణునివలె. ఈ యుపమానములవల్ల జాంబవంతుఁడు కొమార్తెను కృష్ణమూర్తి కిచ్చినట్టు యుద్ధమం దోడిపోయి మానసారుఁ డవంతిని రాజహంసుని కిచ్చుట తోఁచుచున్నది.

సీ.

చేరి యెక్కినచోటఁ బూరి మెక్కినచోట
                 భయదోక్తి దయశక్తి బరగఁ జూపి
బోరుముట్టిన చాయఁ బేరువెట్టిన చాయఁ
                 గరహేతి సరభూతి గడలుకొల్పె
దండ వెట్టినవారి దండ ముట్టినవారి
                 శయశక్తి నయయుక్తి సంఘటించెఁ
గిట్టఁబూనిన చక్కిఁ బుట్టలానిన చక్కి
                 గురుశక్తి యురుభక్తి గుదురుపరచె


గీ.

వగలు మీఱఁ బొదలు దూర సిగల జార
గదలు జారఁ గ్రమకమక్షమలు జరపె
సమరతలమున నమరె విక్రమరసమున
రణవిహరణాధ్వరధ్వంసి రాజహంసి.

12

12. చేరి యెక్కినచోటన్ = ఎదురుకొన్నచోటు. పూరి మెక్కినచోటన్ = గడ్డి గరఁచినచోట. భయద = భయము నిచ్చునట్టి.