పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

225

మణి = మణులవంటి గుణములుగలవాఁడు అని. మంచరాగమ్ము = మందరపర్వతముయొక్క. ఉమ్మలిన్ = మథముచేత. పారమును= ఒడ్డును. బుధస్తుతిన్ = దేవతలయొక్క పొగడికను. తతగుణ = విస్తారపుగుణములు గల. మణి = చింతామణి మొదలగురత్నములుగలవాడు అనియును. వడి...దాత = వడిగలవారిని = వేగముగలవారిని. పడనూది = పడఁగొట్టి. బలము = సేనను. కడలఁబోవఁగనీక = పైకిఁ బోనీక. దాత = నరికేవాఁడు అని. వడిగల వారిని = వేగముగల నీటిని. బడబాది = బడబాగ్ని మొదలగు. ఇక్కడబడబకును, అగ్నికిని అభేదము. బలము= సమూహము. కళలన్ = తరంగములచేత. దాత = దాతృత్వముగలవాఁడు. సాగన్ = జరుగునట్లు. రమ్మను = రావలసినదనునట్టి. కరము వీచి = చెయ్యి విసరి. చెత్తలన్ = . బలహీనులను అని. సాగరమ్మను = సాగరమనునట్టి. కరము = మిక్కిలి. వీచినన్ = తరంగముచేత. చెత్తలన్ = తుక్కులను. అనియును.

క.

అరదం బరదము హరి హరి
కరి కరియు న్ఫటుఁడు భటుఁడు గాఢచ్ఛలనం
జొరఁ బారి పోరు తఱి బం
ధురమై తర మెన్నరాని దురమై దొరసెన్.

9


ఉ.

మాళవ మాగధుల్ వరపుమార్గణ మొక్కటి పెక్కురూపులై
వ్రాలిన వాజి రాజి మహి వ్రాలె రథధ్వజపాళి నుగ్గులై
వ్రేలె భటచ్చటాంగములు వ్రీలె మదావళదంతకుంతముల్
గూలె సమస్తభూతములు గ్రోలెఁ గళేబరముక్తరక్తముల్.

10

10. దంతకుంతముల్ = ఈటెలవంటి దంతములు.

చ.

సరసికిడాయు మత్తకరిచాడ్పున మాగధుపైని దంతిరా