పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

224

రాజవాహనవిజయము


మందరాగమ్ము నుమ్మలిఁ బారమును జేర్చు
                 తరి బుధస్తుతిఁ గన్నఁ తత గుణమణి
వడిగల వారినిఁ బడబాది బల మిట్లు
                 గడలఁ బోవఁగనీక నడపు దాత

మన

క.

సాగ రమ్మను పలుకుమించంగఁ గరము
వీచి బైటికిఁ జెత్తలఁ ద్రోచి వైచి
వాహినీనాథుఁ డొకఁ డొకఁ డాహవమునఁ
గలయఁ బడుటయుఁ గనిపట్టె ఖచరతతికి.

8

8. ఈ పద్యమందు (వాహినీపతి = సేనానాయకుఁడు అనియు నదులకుఁ బెనిమిటియగు సముద్రుఁ డనియు) రెండుపక్షములయం దర్ధము గలదు. సింధురాజీ = సింధుర = ఏనుఁగులయొక్క. ఆజీ = యుద్ధ మందు అని. సింధు = నదులయొక్క, రాజీ = పఙ్క్తిచేత అనియును. నవ...నారదుఁడు = నవ = నూతనముగా. ముక్త = విడువబడిన. శర = బాణములచేత. తుష్ట = సంతోషించుచున్న. నారదుండు = నారదమునిగలవాఁడు అని, నవముక్త = కొత్త ముత్యములుగలవాడును. శర = ఉదకముచేత. శుద్ధ = సంతోషించుచున్న. నారదుండు = మేఘములుగలవాడును అనియును. తన కీర్తి = తనయొక్క. అభ్యుదయ = అభివృద్ధి సంబంధమయిన, లీలన్ = చేష్టను. పోటునెరపుచున్ = ఆయుధప్రయోగముఁ జేయుచు, పాటుఁజూపిన = ఆయాసముఁ జూపించి. ప్రబల = ప్రకృష్ణసేన యొక్క. కీర్తి = యశముగలవాఁడు అని. తనయ = కొమారుఁడైన చంద్రునియొక్క. అభ్యుదయ = ఉదయముయొక్క. లీలన్ = విలాసమును. పోటు నెరపుచున్ = పొంగుచు. పాటుఁ జూపిన = తగ్గునుజూపిన. ప్రబలకీర్తి = గొప్పబురదగలవాఁడు. సముద్రము పోటెక్కినప్పుడు కలతచే బురద బయలుదేరును. అనియును. మంద... మణి = మంద = కొద్దియైన. రాగమ్మును = ప్రేమయును. ఉమ్మలిన్ = కోపమును. పారమును జేర్పుతఱిన్ = కడముట్టించినపుడు, నిగ్రహములు జూపించునపు డనుట. బుధస్తుతిన్ =విద్వాంసుల స్తోత్రమును.గుణ