పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

214

రాజవాహనవిజయము

రాజదేవేంద్రుఁడు, పాకపాటన = దేవేంద్రునియొక్క. దిశ = దిక్కు. తూర్పనుట. పిరంగి వాటునకున్ = పిరంగి దెబ్బకు. చోటు = తగినస్థలము.

ఉ.

కన్నడరాయఁ డాత్మకరకంజసమాహితబాహుమూలుఁడై
వన్నెగఁ గొల్వ నశ్వపతి వస్త్రసమన్వితహస్తవక్త్రుఁడై
విన్నపమాచరింప నరవిందముఖీశయచామరానిలా
భ్యున్నతి నిర్దళత్కచము లుత్కలభర్త పొసంగ దువ్వఁగన్.

121

121. కన్నడరాయుఁడు = కర్ణాటదేశపురాజు, ఆత్మకరకంజసమాహితబాహుమూలుఁడు = తన హస్తపద్మములచేతఁ గూర్చఁబడిన చంకలుగలవాఁడు. అనఁగా మడిచేతులు బట్టినాఁడు. వస్త్రసమన్వితహస్తవక్త్రుఁడు. గొప్పవారితో భృత్యులు మొదలగువారు మాటాడునప్పుడు నోటియొద్ద బట్టనుంచుకొనుట వినయలక్షణము. అరవించముఖీ = స్త్రీలయొక్క. శయ = హస్తములయందైన. చామర = వింజామరలయొక్క. అభ్యున్నతి = అతిశయముచేత. నిర్గళత్ = పారుచున్న, కచములు = వెండ్రుకలు.

సీ.

గాయనీగానరేఖాద్రవన్మణిచంచు
                 బకదాత్మభూహయప్రతిమకంబు
వైణికీవల్లకీవాద్యశ్వసద్భృంగ
                 శంకాపదస్తంభశక్రశిలము
గణికాకటాక్షాంబకప్రయోగప్రవీ
                 ణధనుర్ధరచ్చిత్రనలినశరము