పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

213


ముంచిన దట్టంపు మంచి జాడించిన
                 తలిరుపాయంపునెత్తమ్మి యనఁగ
నప్పసం బెడయని కుప్పసం బూడిచి
                 కొఱఁతఁ ద్రోఁచిన త్రాచుకూన యనఁగ


గీ.

నింతి దొగరేకు చిగురాకు టేకుఁదమ్మి
దొమ్మిగాఁ గ్రమ్మిన మిటారి దొర కటారి
వాడిమై వేఁడి మై తెల్పు వీడనాడి
పోడిమిఁ జెలంగె నప్పు డప్పువ్వుఁబోఁడి

119. పోకార్చు = పోగొట్టిన. రేరాచరేక = చంద్రరేఖ. హురుమంజి = హురుమంజి దేశమందైన. కట్టాణి = మిక్కిలియాణెమైన. జాడించిన = పోగొట్టిన. అప్పసంబు = ఎల్లప్పుడును. ఎడయని = విడువని. కుప్పసము = పొర. త్రాచుకూన = పాముపిల్ల. చిగురాకు టేకున్ =దూదిపింజెవంటి చిగురాకును. దొమ్మిగాన్ = సమ్మదముగా. క్రమ్మిన = వ్యాపింపఁజేసిన. మిటారి = మదముగల. దొర = మన్మథునియొక్క. కటారివాడి మైన్ = కత్తియొక్క తీక్ష్ణత్వముచేత నైన, వేడిన్ = కాకచేతఁగల. మై తెల్పున్ = శరీరపాండిమను. విడనాడి = పోఁగొట్టి.

వ.

అట్టియెడ నమ్మాగధేయ వసుధామండలాఖండలుం
డుద్దండవేదండకాండాదిబలంబుల గూడుకొని
మానసార మానవపాలశైలభేదను మీఁదికిం గదలి
కదలికాక్రముకాది వనవాటంబుల వాటంబై కోటకుం
బాకపాటనదిశ పిరంగి వాటునకుం జోటని యొక్క
తటాకతటాగ్రంబున మెండుగా దండువిడిచి యుండె
నంత నయ్యనంతీపురంబున.

120

120. వసుధామండలాఖండలుండు = భూదేవేంద్రుడు. కాండాది = గుఱ్ఱములు మొదలుగాఁగల, మానవపాలశైలభేదనుఁడు =