పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

210

రాజవాహనవిజయము


క.

అని యిట్లు బాలచంద్రిక
వినిపించిన విన్నపంబు విని యాడం బో
యిన తీర్థ మెదురుగా వ
చ్చిన యట్లని పలికి కలికిచెలి కిట్లనియెన్.

111


శా.

ఏలా చింతిల మీ యవంతికిని యింతీ దారుణాస్మద్భుజ
వ్యాళావక్రపరాక్రమక్రమణచర్య ల్మాళవాధీశుపై
జాలం జూపి సమస్తలోకములు మెచ్చ న్నాల్గు మున్నాళ్ళలో
బాలారత్నము నూత్నరత్న మన సంభావించి లాలించెదన్.

112


వ.

అని దుకూలాదుల నబ్బాలచంద్రికాతలోదరి నాదరించి
పంచిన నవ్విపంచికావాణియు నిజప్రాణవయస్యోప
వనంబునకుఁ బవనవేగంబునం జనుదెంచి.

113

113. దుకూలాదులన్ = పట్టుబట్టలు మొదలగువానిచేత. విపంచికావాణి = వీణవంటి వాక్యములుగల బాలచంద్రిక.

క.

దృక్తరళజీవభారన్
ముక్తాహారన్ నిరస్తముక్తాహరన్
నక్తం దివాశ్రుధారా
సిక్త కటం ద్యక్తవలయఁ జెలియం గాంచెన్.

114

114. దృక్తరళజీవభారన్ = దృష్టివలెఁ జలించుచున్న ప్రాణసమూహముగల. అనఁగాఁ బ్రాణములు విరహబాధచేఁ గదలిపోవుచున్నవనుట. ముక్తాహారన్ = ముక్త = విడువబడిన. ఆహారన్ = భోజ