పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

211

నముగల. నిరస్త =విడువఁబడిన. ముక్తా = ముత్యములయొక్క. హారన్ = హారములు గల. నక్తం దివ = రేయుంబగళ్ళు, కటన్ = గండస్థలములు గల. త్యక్తవలయన్ - విడువఁబడిన కడియములుగల.

క.

కాంచి దృగంచలవంచిత
చంచల మదచంచరీకచంచచ్చికురం
గుంచితముకురకపోల ను
దంచితగతిఁ జేరి హృదయ దయ దయివారన్.

115

115. దృంగచల = నేత్రకోణములచేత. వంచిత = వంచించఁబడిన. చంచల = మెఱుపుగలది. చంచరీక = తుమ్మెదలవలె. కుంచిత = వంచఁబడిన. ముకుర = అద్దములవంటి. కపోల = గండస్థలములు గలది. దయివారన్ = అతిశయించగా.

ఉ.

చక్కని మేనఁ గట్టిన బిసప్రసవాదులు ద్రోచివైచి లేఁ
చెక్కుల నప్పళించిన యశీతదృగంబులు చేల నద్ది చన్
జక్కవ జారు పయ్యెదయుఁ జక్కఁగఁ జేర్చి వికీర్ణకేశముల్
మక్కువ దువ్వి క్రొవ్వెద యమర్చి సఖీమణిఁ గూర్చి యిట్లనెన్.

116

116. బిసప్రసవాదులన్ = పద్మములు మొదలగువానిని. అశీత = వెచ్చనైన. దృగంబులు = కన్నీళ్ళు. చేలన్ = బట్టచేత. క్రొవ్వెద = కొప్పు.

ఉ.

నీ చలపట్టినట్టి పని నిశ్చల మాయెఁ గదమ్మ, కొమ్మ, నీ