పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

191

వదన = ముఖముగల మా అవంతియొక్క, ఆర్తి = పీడ. సొంపే = మంచిదా.

ఉ.

చక్కెరవిల్తు పక్కెరల జక్కినటంచును విక్కి విక్కి, నే
డెక్కుడు మాటలం బదరె దింతియె కాని యవారి యానవా
ల్చక్కెరఁ బెట్టి రాము కతఁ జక్కగ నేర్పుచుఁ బెంచినట్టి యా
యక్కను జూడవైతివిగ దా ప్రమదాళి నిగూఢకీరమా.

66

66. పక్కెరలజక్కి =కవచముగల గుఱ్ఱము, అవారి = ఆనందముగా. అనవాల్ = చిక్కగాఁ గాచిన పాలు. అక్కను = అవంతిని, ప్రమదాళి = మదపంఙ్తిచేత. నిగూఢ = కప్పఁబడినదానా.

మ.

వనవాసంబు ఫలింపలేదొ ద్విజభావం బూనలేదో రతీం
ద్రుని వయ్యాళినిఁ బెంపలేదొ మదియందున్ రామనామామృతా
ప్తనవానందము నందలేదొకో శుకత్వం బెందుఁబోయెన్ వహిం
పని పల్కేటికి నీకు మౌనము వహింపన్ భారమా రమా.

67

67. ఈ పద్యమందు చిలుకపక్ష మొక యర్థమును, శ్రీశుకులవారిపక్ష మొక యర్ధమును గలవు. వనవాసంబు రెండర్థములయందు సమము. ద్విజభావంబు = పక్షిత్వము, బాహ్మణత్వమును. రతీంద్రుని