పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

192

రాజవాహనవిజయము

వయ్యాళిని = మన్మథవిహారమును. పెంపలేదో = వృద్ధి చేయలేదా అనియును, పోఁగొట్టలేదా అనియును. రామనామ = రామ అనుపేరు, రామమంత్రమనియును. శుకత్వంబు = చిలుక యౌట, శ్రీశుకులౌట. మౌనము వహింపన్ = మాటాడకుండుట, మునిత్వమునొందుట యనియును.

వ.

అని పలికి చిలుకలకొలుకు లపరిమితపరితాపంబునం
గుందుకుంద యపదశ దశావశంవదయైన విశం
కట పటీర పన్నీర నీహార పూర కర్పూర కల్హార
దళంబులం జెంగావి చలువం జలువఁ గావింప నచ్చె
లువ కొంతకొంత దెలసె నంతఁ బ్రభాతసమయ బగు
టయు నవంతీసీమంతినిం గూర్చి బాలచంద్రిక
యిట్లనియె.

68

68. ఉపదశ = తొమ్మిదవదైన. దశా = మన్మథావస్థకు అనఁగా మూర్ఛకు. వశంవద = స్వాధీనురాలు చెంగావి చలువన్ = ఎఱ్ఱబట్టచేత.

ఉ.

జాగరమాయెనమ్మ మనసన్నుతగాత్రికి నిన్నరాత్రియో
హెూగరమాయెనమ్మ చెలి కోగిర మింతి లలాటపట్టికన్
నాగరమాయెనమ్మ మృగనాభిక పట్టి లతాంగియశ్రువుల్
సాగరమాయెనమ్మ యని జాలిఁ గలంగెదరమ్మ నీ సఖుల్.

69

69. ఓగిరము = అన్నము. గరము = విషము, నాభిక = కస్తురి, పట్టి = పట్టు, నాగరము = సొంటి, సొంటి పట్టువలె మండుననుట, సాగరము - సముద్రము.