పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

190

రాజవాహనవిజయము


మందిం దిరమై తేనియ
మం దిందు రహింతు ననుచు మద మేమిటికిన్.

63

63. వనమందిర = అడవి యిల్లుగాఁ గల, ఇందిందర = తుమ్మెదా. ఇందున్ = ఇక్కడ. ఇందిరనందనుండ = మన్మథుఁడే. ఏలినయెడన్ = రక్షించినట్లయితే. ఈమందిన్ = ఈ జనులను. తిరమై= స్థిరపడి. తేనియమందు = తేనెయనెడు మత్తుమందు, ఇందున్ = ఈజనులయందు, రహింతు ననుచున్ = వృద్ధి జేసెదనని. మద మేమిటికిన్ = గర్వమెందుకు. మన్మథుఁడు రక్షించెనా నీ వేమి చేయఁగలవని తాత్పర్యము.

క.

పదమా మొరయిక చెలియా
పద మాటికి నీకు బ్రహ్మపదమా నలినీ
పద మానిని యే డ్పా హరి
పదమా నే డింతయేల పద షడ్పదమా.

64

64. మొరయిక = అరచుట. పదమా = పాటా, లేక యిదే ఉద్యోగమా. చెలియొక్క ఆపద నీకు బ్రహ్మపదమా. అనఁగా బ్రహ్మస్థానము దొరకడము వంటిదా. నలినీపద = తామరపొద నివాసముగలదానా, మానినియొక్క యేడ్పు. ఆ హరిపదమా = వైకుంఠమా. నేడు. ఇంతియేల = ఇంత గొడవ యెందుకు. పద = అవతలకి నడువు.

క.

శుకమా చంచూజిత కిం
శుకమా మోహీకృతైకశుక హేమాభాం
శుకమా పరిపూర్ణసుధాం
శుకమానితవదనయార్తి సొంపే నీకున్.

65

65. చంచూజితకింశుకమా = ముట్టెచేత జయింపఁబడిన మోదుగమొగ్గగలదానా. మోహీకృత = మోహముగలవాఁడై చేయఁబడిన, ఏక = ముఖ్యుఁడగు. శుక = శ్రీశుకులుగలదానా, హేమ = బంగారమువంటి. ఆభ = శోభగల. అంశుక = కిరణములుగలదానా. పరిపూర్ణసుధాంశుక = పూర్ణచంద్రునివలె, మానిత = గౌరవించబడిన.