పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

187

అనియు కనుకనే యొళ్ళు చెడ్డవాఁడు. ఎక్కటి = ఒంటిగానుండునట్టి. దేవి = పూజ్యస్త్రీకి, మిండఁడు = విటకాఁడు.

ఉ.

మాత దరిద్రతాదమని మామయుఁ జల్లనిరాచమిన్న
తాత గభీరతాతనుఁడు తండ్రియునుం బుకుసోరుషోత్తముండు
భ్రాత జగద్విధాత మధుబాంధవ యీతెగవారి నేరి నీ
రీతినిఁ బోలవైతి వొకరి న్మకరీసుకరీకృతధ్వజా.

56

56. మకరీసుకరీకృతధ్వజా = మొసలిచేత సులభమై చేయఁబడిన జెండా గలవాఁడా.

క.

ఏరీతి నుదయ మందితొ
సారసనాభోదరమున సర్వజ్ఞులకున్
మారుఁడ కుతికకు దిగ వం
భోరాశికి హాలహలము బుట్టిన మాడ్కిన్.

57

57. సక్వజ్ఞులకున్ = గొప్పవిద్వాంసులకైనను, కుతికకు దిగవు = గొంతుకఁబడెదవు, అనఁగా బాధించెదవు. హాలహలము = విషము. అదియును, సర్వజ్ఞులకు = పూజ్యులైన సాంబమూర్తివారికి కంఠము దిగదు.

ఆ.

కమల మథన వదన కళ సంచు నెంచవు
కమల మదనవ దనఘ ప్రమధన
కమల వదనవద్య ఖర దృష్టి నాఁడేల
కమల వదన మదన కఠిన కదన.

58