పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

186

రాజవాహనవిజయము


గీ.

పాంథకోటి విపాటనపాటవమున
నీకు వలరాజునకు భేదనియతి గలదె
యోకువలరాజ పేర్కొన నొక్కతీరె
యాదివర్ణంబు నీ కింత యధికమగుట.

53

53. కువలరాజ = కలవరాజగు చంద్రుఁడా. వలరాజుకంటే గువలరాజుకు బేరుమొదట నొక కు అను అక్షర మెక్కువ గాని తక్కినదంతయు సమానమేయని తాత్పర్యము.

క.

తెఱవ నపరాధరహితం
గఱకఱిఁ బెట్టెదవు మ్రింగఁ గావచ్చు నరిం
దఱిఁ జంపఁ గొనవు నిన్నిం
దఱు చేతుల చెడ్డవాఁడ నరె పాండుకరా.

54

54. కఱకఱి = బాధ. పాండుకరా = తెల్లని కిరణములు గలవాఁడా యనియు, బొల్లిచేతులవాఁడా యనియును, కనుకనే చేతులు చెడ్డవాఁడవరా.

ఉ.

చక్కెరబొమ్మపైఁ గరము సాచుట కొండలపిండి నీకు నీ
వక్కట యుక్కటం గలుషమన్నఁ గలంగవు తారఁ గొండ్రెకాల్
ద్రొక్కిన లీల శూలి తలఁ దొక్కఁ దలంతురె యొళ్లు చెడ్డవాఁ
డెక్కటి దేవి మిండఁడనుటెల్ల యథార్థము పాండురాంగకా.

55

55. కొండలపిండి = పంచదారబొమ్మగదా అని చెయ్యిదాపుట, కొండలు పిండి చేయఁ దలంచినట్టు కఠినమైనపని, ఉక్కటన్ = గర్వముచేత, పాండురాంగకా = తెల్లని శరీరముగలవాఁడా, బొల్లివాఁ