పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

185

జ్ఞావతంసంబు = సర్వము నెఱిఁగినవారిలో శ్రేష్ఠుఁడనియు, శివుని శిరోభూషణ మనియు. కుముదాప్తుఁడు = (కుముత్ = కుత్సితసంతోషము గలవారికి, ఆప్తుఁడు - ఇష్టుఁడు అని కలవల కిష్టుఁడనియు.) సన్మార్గస్థుడు = యోగ్యమార్గమం దున్నవాఁడని, నక్షత్రమార్గమం దున్నవాఁడనియును. విషజుండవు = గరళమందు బుట్టినవాఁడనియును, నీటియందుఁ బుట్టినవాఁడవనియును. తమోవిహారి = అజ్ఞానముచేత సంచరించువాఁ డనియు, చీకటియందుఁ దిరుఁగువాఁ డనియును.

శా.

చంద్రా! చంద్రకహాస నేచెదవయో చంద్రాఖ్య నీ కేల నీ
చంద్రత్వంబునఁ బాంథకోటి తనువుల్ శైత్యంబునుం జెందెనో
సాంద్రామోదము నొందెనో తుదిఁ దలంచం బాండువర్ణంబు భో
గీంద్రాక్రాంతత శారదాభ్యుదయు మిందే వింతశౌర్యాప్తికిన్.

52

52. చంద్రకహాసన్ = కర్పూరమువంటి నవ్వుగల యవంతిని. చంద్రాఖ్య = కర్పూరమను సంజ్ఞ. పాంథ...జెందేనో = మార్గస్థురౌలౌటచేత విరహులైనవారి శరీరములు బాధపడుచున్న వనుట. కర్పూరమువల్లనైతే శరీరములు చల్లబడును. సాంద్రా... నొంచెనో = ఆనందమును నొందలేదనుట, కర్పూరమువల్లనైతే పరిమళము నొందును. పాండువర్ణంబు = తెలుపు, బొల్లియు. భోగీంద్రాక్రాంతత = పాముచేత ననఁగా రాహువుచేత నాక్రమించఁబడుట, భోగముగలవారిచేత స్వీకరించబడుట అని కర్పూరపక్షమందు. శారదాభ్యుదయము = శరత్కాలసంబంధమైన యభివృద్ధి. ఏడాకుల అనటిచెట్టువలనఁ బుట్టుట. తెలుపు మొదలగు మూఁడుగుణములు నీకును గర్పూరమునకును తుల్యములనుట. ఇందే = ఈ గుణములయందే. శౌర్యాప్తికి వింత. అనఁగా నీగుణములలో శౌర్యముండుట చిత్రమని తాత్పర్యము.