పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

184

రాజవాహనవిజయము


దినగండమునఁ గౌముదియుఁ గావుమని వేడు
                 చోటఁ జల్లని చూపుఁ జూడలేదొ


గీ.

వనిత యింకిట్టి సమయ మెవ్వరికి లేదు
నేటి యామని బుగబుగ ల్నీకు సతమె
కాల మిటువలెనుండునే కాలకంఠ
కంఠ గరళ కళంక రాకాశశాంక.

50

50. ఉపరాగవేళన్ = గ్రహణకాలమందు, కన్నులఁ గప్పికొనదొ = కన్నులలోఁ బెట్టుకొని రక్షింపలేదా కన్నులకు కలువలకును సామ్యముగనుక కన్నులతో సమానముగాఁ జేసికొన్నదిని భావము. పై మూడుపాదములయందు నిట్లుగానే యూహింపవలెను. కుహుయోగ = నశించిన చంద్రకళగల అమవాస్యయొక్క సంబంధముచేతనైన. నీసతులు = నీభార్యలయిన చుక్కలు. ఆమని బుగబుగల్ = వసంతఋతుసంబంధమైన పరిమళములు, సతమె యెల్లపుడు నుండునా, కాల...కళంక. కాలకంఠ = శివునియొక్క, కంఠ = కంఠమందయిన, గరళ = విషమువంటి, కళంక = కళంకముగలవాఁడా.

మ.

వరుస న్సారసవైరివైన నిను సర్వజ్ఞావతంసం బనం
దరమౌనే కుముదాప్తుఁ డైన నీను సన్మార్గస్థుఁ డీతం డనన్
సరసంబే విషజుండ వీ వమృతదానఖ్యాతుఁ డన్నన్ విన
న్సరళం బౌనె తమోవిహారి యనినన్ ధర్మంబు దోషాకరా.

51

51. దోషకరా = పాపములకు స్థానమైనవాడా అనియు, రాత్రినిఁ జేయు చంద్రుఁడా అనియు, సారసవైరివి = సరసులసమూహమునకు విరోధివనియు, పద్మవిరోధివనియును. సర్వ