పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

168

రాజవాహనవిజయము


య మాసమానస నౌకయై ఫాలజిత బాలచంద్రిక
బాలచంద్రిక నిట్లనియె.

17

17. భోగ = అనుభనించుట, లతాంతరస = పుష్పమకరందము. ఆలనాల = పాదులయందుఁ గల, రసాలజాల = మామిడిచెట్ల సమూహమనెడు. స్మరలీలాఖురళిన్ = మన్మథుని విలాసార్ధమగు గరిడీయందు. విథుకాంత = చంద్రకాంతమణులచేత, పృధు = గొప్పలగు, కాంతి = సుందరములగు, కేళికా బాలికా = ఆడుకొనుపిల్లలతోఁగూడిన. మానసనౌక = మనస్సనెడి యోడగలది. ఫాల = నుదిటిచేత. జిత = జయింపబడిన. బాలచంద్రిక = లేతచంద్రుఁడు గలది.

సీ.

మనకుఁ జేరువ చందమామైన రామోముఁ
                 గననీక హృదయంబుఁ గందఁ జేసె
నమృతంపునడబావి లో యగు భూవిభుని మోవి
                 యందనీక కళంక మందఁ జేసెఁ
దంగేటిజున్నైన ధరణీశు పల్కుఁ గో
                 రిక విననీక మేల్ రేచి విడచెఁ
గొంగు బంగారైన ఆ కువలయాధిపునకా
                 మొరయంగ నీక కా కొందఁ జేసె


గీ.

దృఢ పరీరంభ సుఖవిఘ్న దేవతామ
తల్లి గా కిది తనుఁగన్న తల్లి యేనె
తల్లికుచ కుచ యిప్పుడే తల్లి కొనియె
దల్లిపై వగపుల నాపఁ దల్లి తరమె.

18

18. ఆమొరయంగనీక = పైకొననీక. కాకు =కష్టము, పరీరంభ = ఆలింగనముచేత నైన. విఘ్న = విఘ్నములకు, దేవతామతల్లి = దేవతాశ్రేష్ఠురాలు. లికుచ కుచ = గజనిమ్మపండ్లవంటి స్తనములు గల యోబౌలచంద్రికా, వెతల్ = ఆయాసములు, ఏతు = అతిశయముగా.