పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

169

అల్లికొనియెన్ = ఆక్రమించెను. తల్లి = అమ్మా! ఓ బాలచంద్రికా! పైవగపులన్ = ముందువచ్చు దుఃఖములను, ఆపన్ = మాన్పుటకు.

ఉ.

తల్లులు లేరొ కల్గరొ సుతల్ తనుజాతల కాడుపోడుముల్
మొల్లమి నుల్లసిల్లకయ మున్న సమున్నత విభ్రమాంబురు
డ్భల్లుఁ డనుంగుటల్లుఁడు శుభావహుఁ డెవ్వఁడొ యండ్రుగాక కా
కల్లతవంటి పట్టి కిడుగామిడిఁ గంటివె కామినీమణీ.

19

19. తనుజాతలకున్ = కొమార్తెలకు, ఆడుపోడుముల్ = స్తనములు మొదలగునవి. సమున్న...ల్లుఁడు = (సమున్నతవిభ్రమ = గొప్పవిలాసములచేత, అంబురుట్ = పద్మమే, భల్లుఁడు = బల్లెము గల మన్మథుడైన) కాకల్ = బాధలు, గామిడిన్ = గొప్పగ్రహమును.

ఉ.

అన్నరపాలు వాలుగుల కగ్గలమౌ తేలిసోగకన్ను లా
కొన్నెల నెన్నొసల్ వెడదరొమ్ము చొకారపుతేఁటచెక్కు ల
భ్యున్నతబాహుపీఠి యొరపు న్మెఱపు న్మరపించు నంగముం
గన్నులఁగట్టినట్టయిన గంటికి నిద్దుర రాదె నెచ్చెలీ.

20


శా.

ఈ యంభోధిపరీతభూభుజులయం దెందైనఁ గల్గొంటివా