పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

166

రాజవాహనవిజయము

చక్రవాకము. దేశమును. నేనొచిన్నదానికిఁ దగుదు ననుట లోకమెల్ల నెరుఁగునని తాత్పర్యము.

సీ.

ఇది కాంత కాంతారహేల వాటింపుచో
                 గాలుజారిన పరాగంపుదిన్నె
యిది కొమ్మ కొమ్మకై యెగయుచో నందంద
                 చిందు మాకందమరందధార
యిది కన్నె కన్నెనారదముల కొకతెతో
                 గోపించి వెదజల్లు కుందబృంద
మిది చెల్వంబు గదసిపైఁ బద మూది
                 మేను జేర్చిన కమ్మ మెట్టదమ్మి


గీ.

ఇచటఁ గూర్చుండి చెలువ బల్ హేల లనియె
నిచ్చట మదీయలావణ్య మిచ్చ మెచ్చి
తొగరు చిగురాకు పొగరున సగము గొఱికి
మగువ కిడు కోయిలనుగాంచి పొగిలె నబల.

14

14. కాంతార = వనవిలాసము. మాకంద = మామిడిపువ్వులయొక్క కన్నెనారదములకున్ = లేఁతనారింజచెట్లకు.

క.

అని చింతింపుచు వని జ
వ్వని వనితలఁ గూడి మెలఁగు నలి చప్పరముల్
నన చిదిమి పొదలు పొదలం
బనివడి వడి వెదకి వెదకి మదనాలసుఁడై.

15

15. పొదలు పొదలన్ = - వృద్ధిఁ బొందుచున్న పొదరిండ్లయందు. హేల లనియెన్ = విలాసవాక్యములు బలికెను.

సీ.

చెలియ నెమ్మేను జూచితినేని సంపంగి
                 దండ నీ కర్పించె దన్మనోజ