పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

165


చిత దరదంబుగా గళము చిత్రముగా నిలు వబ్జనేత్ర స
మ్మతిఁగనుఁగొన్ రసజ్ఞునకు మందునకుం దగ నంద మందదే.

12

12. రసజ్ఞునకున్ = సరసునకు. అతిమధురంబు = మిక్కిలి తియ్యనిది. ఆభ్రము = మేఘము. జ్యోత్స్న = వెన్నెల. ఘనసారము = కర్పూరము, దరదము = శంఖమును ఖండించునది. నిలువు = ఆకారము. చిత్రము = చిత్తరువు, ఈ చిన్నదానిఁ జూచిన రసజ్ఞులకే యిట్లుండఁగా. మందునకున్ = మూఢునికి. అందముగా నుండదా, (లోకమందు రసికునకు నెంత సౌందర్యవతియైనను నచ్చదు. మూఢునికి గురూపి యయినను సౌందర్యవతివలెఁ దోచును.) ఇందు వైద్యపరముగా మఱియొక యర్థముగలదు. అతిమథురమను గ్రంధ్యాణము, అభ్రము = అభ్రకము. జోత్స్న = పొట్లతీగె. ఘనసారము = పచ్చకర్పూరము. దరదము = పాదరసము. చిత్రము = చిత్రమూలము, రసజ్ఞునకున్ = రసప్రయోగము నెఱిఁగిన వైద్యునికి. మందునకున్ = ఔషధమునకు.

క.

చెలి డాసి తమిఁ గరంబుల
గిలిగింత లొకింత వింత గీల్కొన నేఁ డు
త్పలపత్త్రము నిలిపె నగాం
చలమున రాజనఁగ దగుట చక్రం బెఱుఁగున్.

13

13. తా నాచిన్నదానికిఁ దగుదునని చంద్రుని మిష చేసి రెండర్ధములుగా రాజు చెప్పుచున్నాడు. రాజు = చంద్రుఁడు, ఱేఁడును. చెలిన్ = కల్వపొదను, అవంతిని. తమిన్ = రాత్రియందును, కామముచేతను. కరంబులన్ = కిరణములచేతను, హస్తములచేతను, గిలిగింతలు = వికసింపఁజేయుటలు, కితకితలు. ఉత్పలపత్త్రము = కలువరేకు, నఖక్షతవిశేషమును. నగాంచలమునన్ = పర్వతశిఖరమందును. (ఉపమేయ నిగరణముచేత) స్తనాగ్రమందును. చక్రంబు =