పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

144

రాజవాహనవిజయము

రణరాజి = తుమ్మెదలపఙ్క్తి, రంభ = అనటిచెట్టు, ఆ పేరుగల స్త్రీయనియును, కాల = నల్లనయిన. జాంబవ = నేరేడుపళ్ళయొక్క. అరవిరి = సగమువికాసముయొక్క, పుష్పంధయ = తుమ్మెదలయొక్క. గజిబిజింపుచున్ = కలతపడుచు, తిర్యక్పరీత = అడ్డముగా వ్యాపించిన, చంచరీక = తుమ్మరలయొక్క, రేఖ = వరుస. అనేకపంబునకున్ = ఏనుఁగునకు, సోలించుచు = మూర్ఛనొందం జేయుచు (అమగా కోయుచు) మరువకంబులన్ = మరువములచేత, మాయుచున్ = ధూసరవర్ణము గలవారౌచు, తిన్నెరావులన్ = అరుగులు వేసిన రావిచెట్లను, మదనుమావులన్ = చిలుకలను, అదనుతావులు = సమయానుకూలస్థలములు, పొగరులు దెంపుచు = ఒకరిగర్వ మొకరు అణచుచు. నకనక నవ్వుచు = అలసినవారౌచు, మనుచున్ = వృద్ధి యగుచు, మరులన్ = కామముచేత, ముక్తా = ముత్తెముల యొక్క, నవ = నూతనములగు, సరంబులు = హారములు, గునియన్ = కదలుచుండగా.

సీ.

పూవుఁగొమ్మలు వంప బోనేటి కే యన్నఁ
                 జేమించెదే యభిరామబాహ
చిగురుటా కేటికే చిదిమెదన్నను గయ్య
                 మునకుఁ గాల్దువ్వెదే మోహనాంగి
పసరుమొగ్గలు గోయఁ బాడియే యనఁ బంటఁ
                 బగఁ బూన నేటికే భవ్యరదన
మల్లికావల్లికల్ గిల్లఁ జెల్లదటన్న
                 నొళ్ళేల విరిచెదే యుజ్వలాంగి


గీ.

సంపెఁగలు ద్రుంపఁ జనరాదు చాలింపు మనినఁ
బదరి ముక్కునఁ గోపముంచెదు సునాస
యనుచు నొండొరు నర్మోక్తు లాడుకొనుచుఁ
బ్రసవహరణంబు మాని సంభ్రమముఁ బూని.

116

116. ఈ పద్యమందు ఆరుచరణముల పర్యంతము నర్మోక్తులు ఎట్లంటే = పూవుగొమ్మ నేల వంచినావని యొకచెలికత్తె అడుగగా