పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

145

అభిరామబాహ అని సంబోధనచేత మనోహరములు చేతులుకలదానవు గనుక. (చేమించెదే = దెబ్బలాటకు వచ్చెదవా అనియును,నేను వంచునట్టి పూవుగొమ్మను హస్తసౌందర్యముచే నతిక్రమించెదననియును తాత్పర్యము. కడవఱకు నీరీతినే సంబోధనలకును, జవాబులకును సార్థక్యము నూహించవలెను. చిగురుటాకుకును కాలికిని సామ్యము. అది మోహనాంగి పసరుమొగ్గలకును, దంతములకును సామ్యము. అది భవ్యరదన = మంచిదంతములు గలది, మల్లికలకును, ఒళ్ళు = దేహమునకును సామ్యము, ఉజ్వలాంగి = ప్రకాశంచుచున్నదేహముగలది. సంపెంగలకును ముక్కుకు సామ్యము. అది సునాస = మంచి ముక్కు గలది.

క.

నాళీక మధూళీ సుమ
పాళీ కమనీయ కిసల ఫల పటల నట
న్నాళీక మరాళీ భ్రమ
రాళీక మహా సరోవిహారాదరలై.

117

117. భ్రమర = తుమ్మెదలయొక్క, అళీక = పఙ్క్తిగల.

సీ.

ఆ సారసేక్షణల్ కాసారతటిఁ జేరి
                 మై సారమణు లంత మరక తిగిచి
సవరగా సవరించు సవరముల్ వదలించి
                 కలికి బాగొలయఁ గీల్గంట్లు వైచి
తల తల తలమంచు దల మించు వలి మంచు
                 వాలించు వలిప పావడలు గట్టి
యలగుండు బులుగుండు బలుపాండురాబ్జంబు
                 పజ్జ వ్రాల్ సతి మేలుబంతి యనుచుఁ


గీ.

గొలను నడుచక్కి కొప్పుల కుప్పలుప్ప
రముగఁ గుప్పించి రుడువీథి రాయ గుభగు