పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

143


మోదించుచు, నరవిందబృందంబులను సోలించుచు, మొల్ల
లకు నరుగుచు, మల్లెలకుం దిరుగుచు, విరవాదులం జిదు
ముచు, గన్నెఱ్ఱఁజేయుచు, గన్నేరులుగోయుచుఁ, గురు
వకంబుల డాయుచు, మరువకంబుల మాయుచు, సన్నజా
జులం దేరుచుఁ, గన్నెమావుల నిలుచుచు, దిన్నెరావులం
గొలుచుచు, మదనుమావులం బట్టుచు, నదనుతావు
ల మెట్టుచుఁ, బరువులు వెట్టుచుఁ, దరువులు సుట్టుచు, మధు
పతతిం దెచ్చుచు, మథుగతి న్మెచ్చుచుఁ, జిగురులు ద్రుం
పుచుఁ, బొగరులు దెంపుచుఁ, బువ్వుల రువ్వుచు, గ్రొవు
ల నవ్వుచు, వికవిక నగుచు, నకనక నగుచుఁ, దలతల
మనుచుఁ, గొలకొల మనుచు, మరుల జరింపుచు, విరుల
హరింపుచు, విహరించిరి ముకానవసరంబులు గునియ
నయ్యవసరంబున.

115

115. గట్టువాకట్టు = పర్వతముల నోరుగట్టునట్టి, చనుకట్టు = స్తనములుగల, గట్టివామిటారులు = రాగలైన స్త్రీలు, ఇది మొదలుగా కొనియాడుచు అను పర్యంతమును తుమ్మెదలయొక్క వర్ణనము. రోలంబ = తుమ్మెదలయొక్క, కుటుంబ = జాతులయొక్క, పాళి = పఙ్క్తి. తిరుపుగట్లన్ = తిరుగగా, కాసెనీలిమ = కాసెవోకయొక్క నలుపు, భసలపఙ్క్తిన్ = తుమ్మెదల బారును. పుష్పమంజరులు = ఈ పేరుగల ధాన్యమును, పువ్వులగుత్తుల ననియును. క్రాయుముసలంబు = దంపునట్టి రోకలి, తపసి = అవిసెచెట్టు, తపశ్శాలియనియును. సందుకొనుచున్ = గ్రహించుచు. ఇందిందిరావళి = తుమ్మెదలపఙ్క్తి. ఇందిరానందనుండు = మన్మథుఁడు. వాటుబల్లెంబు = దెబ్బదగులుబల్లెము. బంభరడింభక = తుమ్మెదపిల్లలయొక్క. దాటు =సమూహము. ఆమనిదొర = వసంతుఁడు. చెలికానిరాకకున్ = మన్నథుని రావడమునకు. తదీయ = ఆ యరటిచెట్టు సంబంధమైన, షట్చ